'పుష్ప' కోసం కైరా అద్వాని స్పెషల్ సాంగ్
- సుకుమార్ నుంచి 'పుష్ప'
- ప్రత్యేక గీతంపై ప్రత్యేక శ్రద్ధ
- అభిమానుల్లో పెరుగుతున్న ఆసక్తి
సుకుమార్ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ దుమ్ము రేపేస్తుంటాయి. అందునా ఈ కథ అడవి నేపథ్యంలో సాగేది కావడంతో, ఆ స్థాయిలోనే ఒక ఐటమ్ సాంగ్ ను ప్లాన్ చేశాడట. ఈ సాంగ్ కోసం కైరా అద్వానీని సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తోంది. కైరా అద్వాని ఒప్పుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని అంటున్నారు. ఇంతకుముందు కైరా అద్వాని .. చరణ్ జోడీగా 'వినయ విధేయ రామ' సినిమాలో చేసిన సంగతి తెలిసిందే.