Vijay Devarakonda: యూత్ లో అనన్య పాండేకి పెరుగుతున్న క్రేజ్

puri Jagannadh Movie

  • హిందీలో కుదురుకుంటున్న అనన్య పాండే
  •  నాజూకుదనానికి ఫిదా అవుతున్న కుర్రకారు
  • పూరి సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన అనన్య 


తెలుగు తెరకి ఎప్పటికప్పుడు కొత్త కథానాయికలు పరిచయమవుతూనే వున్నారు. వాళ్ల అందం .. అభినయం బాగుండి హిట్ పడితే యూత్ లో క్రేజ్ పెరుగుతోంది. అలాంటివారిని మాత్రమే అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. అనన్య పాండే విషయంలో మాత్రం ఇందుకు భిన్నంగానే జరుగుతోంది.

హిందీలో ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న ఈ సుందరి, తెలుగులో పూరి జగన్నాథ్ సినిమాలో విజయ్ దేవరకొండ జోడీగా చేస్తోంది. ఈ అమ్మాయికి యూత్ లో వున్న క్రేజ్ ను గ్రహించిన దర్శక నిర్మాతలు, తమ సినిమాల్లో ఆమెను తీసుకునేందుకు ఉత్సాహాన్ని చూపుతున్నారు. విజయ్ దేవరకొండతో చేస్తున్న సినిమా హిట్ కొడితే, తెలుగులో ఈ అమ్మాయి జోరు కొనసాగడం ఖాయమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Vijay Devarakonda
Ananya Panday
Puri Jagannadh
  • Loading...

More Telugu News