Hyderabad: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తే అత్యవసర ప్రయాణ పాస్‌లు ఇంటికే!

Online pass issue system for emergency jouurney

  • లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాచకొండ కమిషనరేట్ పోలీసుల నిర్ణయం
  • 8 నుంచి 16 గంటల్లోగా అందజేస్తామని వెల్లడి
  • పోలీస్‌ స్టేషన్ల వద్ద రద్దీని నియంత్రించేందుకే ఈ నిర్ణయం

లాక్‌డౌన్‌ నేపథ్యంలో అత్యవసరంగా ఊరెళ్లాల్సిన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే 8 నుంచి 16 గంటల్లోగా  ప్రయాణ పాస్‌లు వారింటికే జారీ చేస్తామని హైదరాబాద్‌లోని రాచకొండ కమిషనరేట్‌ పోలీసులు స్పష్టం చేశారు.

పోలీసుల కఠిన ఆంక్షలు కొనసాగిస్తుండడంతో అత్యవసరంగా ప్రయాణించాల్సిన వారు పాస్‌ కోసం పోలీస్‌ స్టేషన్ల వద్ద బారులు తీరుతున్నారు. ఈ పరిస్థితిని నివారించేలా ఆన్‌లైన్‌ విధానం అమలు చేయాలన్న సీపీ మహేష్‌భగవత్‌ ఆదేశాల మేరకు రాచకొండ పోలీసులు ఈ విధానానికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం రాచకొండ ఐటీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీధర్‌రెడ్డి ప్రత్యేక కృషి చేశారు.

పాస్‌ కావాల్సిన వారు కమిషనరేట్ సైట్లోకి వెళ్లి ‘రిక్వెస్ట్‌ ఫర్‌ పాస్‌’ ఆప్షన్‌ను క్లిక్‌ చేసి వివరాలను నమోదు చేయాలి. సంబంధిత ధ్రువపత్రాలు, ఇతర ఆధారాలను అప్‌లోడ్‌ చేయాలి. సిబ్బంది పరిశీలించి అర్హులైన వారికి ఓ లింక్‌ను వారి మెయిల్‌కి పంపిస్తారు. దాన్ని ఓపెన్‌ చేస్తే పాస్‌ కనిపిస్తుంది. దాన్ని ప్రింట్‌ తీసుకుని వినియోగించుకోవచ్చు.

ఈ విధానం వ్యక్తిగతంగాను, వాహనాలకు రెండు విధాలుగా అమలు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ‘పాస్‌లు  దుర్వినియోగం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో వారు మాత్రమే ఈ అవకాశం వినియోగించుకోవాలి’ అని శ్రీధర్‌రెడ్డి కోరారు.

Hyderabad
rachakonda commissionarate
online pass
  • Loading...

More Telugu News