Akhil: అఖిల్ మూవీ అవుట్ పుట్ పట్ల నాగ్ హ్యాపీ

Most Eligible Bachlor Movie

  • అఖిల్ మూవీ రఫ్ ఎడిటింగ్ పూర్తి
  • కొన్ని మార్పులు చెప్పిన నాగార్జున
  • జూన్ లో విడుదల చేయాలనే ఆలోచన  

అఖిల్ ఇంతవరకూ చేసిన సినిమాలేవీ ఆయన అభిమానులను పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. దాంతో ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన కొంత గ్యాప్ తీసుకుని మరీ 'బొమ్మరిల్లు' భాస్కర్ తో ఒక సినిమా చేశాడు. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' టైటిల్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

అఖిల్ సినిమాలన్నీ రఫ్ ఎడిటింగ్ పూర్తయ్యాక చూసి, సూచనలు చేయడం నాగ్ కి అలవాటు. అలాగే ఈ సినిమా రఫ్ ఎడిటింగ్ పూర్తికావడంతో నాగ్ చూశాడట. ప్రీ క్లైమాక్స్ కి సంబంధించిన ఒకటి రెండు సీన్స్ విషయంలో మార్పులు చెప్పారని అంటున్నారు. టోటల్ అవుట్ పుట్ పట్ల ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారని చెబుతున్నారు. ప్రాజెక్టు కొంత లేట్ అయినప్పటికీ అఖిల్ కి సరైన సినిమా పడిందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారని అంటున్నారు. పూజ హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమాను జూన్లో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.

Akhil
Pooja Hegde
Bommarillu Bhaskar
  • Loading...

More Telugu News