KTR: రామ్ గోపాల్ వర్మపై సెటైర్ వేసిన కేటీఆర్!

KTR Setire on Ramgopal Varma

  • మద్యాన్ని అనుమతించాలన్నట్టుగా ట్వీట్
  • కేటీఆర్, కేసీఆర్, జగన్ లను ట్యాగ్ చేసిన వర్మ
  • హెయిర్ కట్ గురించేగా? అంటూ కేటీఆర్ సెటైర్

ఇండియాలో కరోనా వ్యాప్తి పెరుగుతూ, లాక్ డౌన్ అమలవుతున్న వేళ, రామ్ గోపాల్ వర్మ మాత్రం తనకు కావలసింది అడుగుతూ, పక్క రాష్ట్రాల ప్రభుత్వాల మాదిరిగా పెద్ద మనసు చేసుకోవాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరగా, తెలంగాణ మంత్రి కేటీఆర్, సరదాగా సెటైర్ వేశారు. ఇంతకీ వర్మ ఏం కోరారు? కేటీఆర్ ఏం చెప్పారన్నది చూద్దాం...


తాజాగా వర్మ తెలంగాణ సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లను ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు. "ఇళ్లలో ఉంటున్న వాళ్లు ఏం చేయాలో తెలియక జుట్టు పీక్కుంటున్నారు. చిన్నపిల్లల్లా ఏడుస్తున్నారు.. మెంటల్ హాస్పటళ్లలో చేరుతున్నారు. ఫ్రస్ట్రేషన్‌లో భార్యలను కొడుతున్నారు. మీరు కూడా మమతా బెనర్జీలా పెద్ద మనసు చేసుకుని మాకు 'చీర్స్' చెప్పండి" అని ట్వీట్ చేశారు. తన ట్వీట్ కు 'వెస్ట్ బెంగాల్ లో మద్యం డోర్ డెలివరీ' వార్తను వర్మ జత చేశారు. 


ఇక ఈ ట్వీట్ ను చూసిన కేటీఆర్ చమత్కారంగానే జవాబు చెప్పారు. "రాము గారు, మీరు అడుగుతోంది హెయిర్ కట్ గురించే అనుకుంటున్నా..." అంటూ తనకేమీ అర్థం కాలేదన్నట్టు సెటైర్ వేశారు. ఇప్పుడీ ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News