Srikant: వాళ్ల ఆకలి బాధను చూశానంటూ నటుడు శ్రీకాంత్ ఎమోషనల్ వీడియో!

Hero Srikant Emotional Post on Hunger People

  • సినీ కార్మికుల ఆకలి బాధ
  • స్వయంగా చూసి చలించిపోయా
  • ఆహారం అందించామని శ్రీకాంత్ వెల్లడి

చిత్రపురి కాలనీలో తాను ఆకలి బాధను చూశానని, పేదల ఆకలిని తీర్చేందుకు, తాను, తన స్నేహితులు కృషి చేశామని నటుడు శ్రీకాంత్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను శ్రీకాంత్ పోస్ట్ చేశారు. 

సినీ రంగాన్ని ఆశ్రయించి జీవనం సాగిస్తున్న ఎంతో మంది బీహార్ తదితర రాష్ట్రాలకు చెందిన కార్మికులు, ఇప్పుడు ఆకలి బాధను తీర్చుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారని, ఎంతో మంది ఇప్పటికే వారికి సాయం చేస్తున్నారని తెలిపారు. తనకు విషయం తెలిసి వెళ్లి, వారి ఆకలి బాధను స్వయంగా చూసి, చలించిపోయానని, వారికి ఆహారం అందించామని చెప్పారు.  


కరోనా మహమ్మారిపై మనందరం పోరాడుతున్నామని ఆయన గుర్తు చేశారు. పోలీసు సిబ్బంది, డాక్టర్లు, జీహెచ్ఎంసీ సిబ్బంది ప్రజల కోసం రిస్క్ చేసుకుని డ్యూటీ చేస్తున్నారని కితాబునిచ్చారు. ప్రభుత్వం ఇస్తున్న ఆదేశాలను పాటించాలని సూచించారు. ప్రజల్లో ఎంతోమంది ఇబ్బందుల్లో ఉన్నారని, అవన్నీ తొలగుతాయని శ్రీకాంత్ ఆకాంక్షించారు. 

Srikant
Hunger People
Chitrapuri Coloney
Video
  • Loading...

More Telugu News