Nagari: సెల్ఫీ వీడియో ఎఫెక్ట్.. నగరి మున్సిపల్ కమిషనర్ పై సస్పెన్షన్ వేటు!

Chittoor District Nagari muncipal commissioner has suspended

  • మాస్క్ ల కొనుగోలుకూ తమ వద్ద నిధులు లేవన్న కమిషనర్
  • సెల్ఫీ వీడియోలో చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం సీరియస్
  • ఇన్ చార్జి కమిషనర్ గా సీహెచ్. వెంకటేశ్వరరావు నియామకం

చిత్తూరు జిల్లా నగరి కమిషనర్ వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. ‘కరోనా’ విషయమై ప్రభుత్వంపై  ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన్ని సస్పెండ్ చేశారు. ప్రొటెక్షన్ మాస్క్ ల కొనుగోలుకు కూడా తమ వద్ద నిధులు లేవంటూ ఓ సెల్ఫీ వీడియో ద్వారా ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా నగరి కమిషనర్ వ్యవహరించారని భావించిన  ప్రభుత్వం ఆయన్ని సస్పెండ్ చేసినట్టు సంబంధిత వర్గాల సమాచారం. ఆయన స్థానంలో నగరి ఇన్ చార్జి కమిషనర్ గా సీహెచ్. వెంకటేశ్వరరావును నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.


  • Error fetching data: Network response was not ok

More Telugu News