Prabhas: 'సాహో' శాటిలైట్ హక్కులు 20 కోట్లు!

Saaho Movie

  • భారీ బడ్జెట్ తో వచ్చిన 'సాహో'
  • అంచనాలను అందుకోలేకపోయిన కథ 
  • తెలుగు శాటిలైట్ హక్కులే 12 కోట్లు

ప్రభాస్ కథానాయకుడిగా సుజీత్ దర్శకత్వంలో వచ్చిన 'సాహో' భారీ చిత్రంగా మంచి మార్కులు కొట్టేసింది. అయితే కథాకథనాల పరంగా అంచనాలను అందుకోలేకపోయింది. శ్రద్ధా కపూర్ కథానాయికగా నటించిన ఈ సినిమా, హిందీలో మాత్రం హిట్ అనిపించుకుంది. సినిమా విడుదలకి ముందు నిర్మాతలు శాటిలైట్ బిజినెస్ పై దృష్టిపెట్టలేదు. ఇటీవలే శాటిలైట్ బిజినెస్ కి సంబంధించిన వ్యవహారాలను మొదలెట్టారట.

వారం రోజుల క్రితమే శాటిలైట్ బిజినెస్ డీల్ ను క్లోజ్ చేసినట్టుగా తెలుస్తోంది. తెలుగు .. తమిళంతో పాటు మరికొన్ని భాషల్లో కలుపుకుని ఈ సినిమా శాటిలైట్ హక్కులు 20 కోట్లు పలికినట్టుగా సమాచారం. ఒక్క తెలుగు శాటిలైట్ హక్కులే 12 కోట్ల వరకూ పలికినట్టుగా చెబుతున్నారు. భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మించిన నిర్మాతలకు ఇది కొంత ఉపశమనాన్ని కలిగించే విషయమేనని చెప్పుకోవాలి.

Prabhas
Shraddha Kapoor
Saaho Movie
  • Loading...

More Telugu News