Dharavi: ధారావిలో 7 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించాలని మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం!

BMMC to test 7 lakh people in Dharavi

  • ప్రపంచంలోనే అతిపెద్ద మురికవాడ ధారావి 
  • మురికివాడలో విస్తరిస్తున్న కరోనా
  • ఇప్పటి వరకు 22కు పెరిగిన కేసులు

ధారావి...!
ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ. ముంబైలో ఉన్న ఈ మురికివాడలో అనధికారిక లెక్కల ప్రకారం దాదాపు 10 లక్షల మంది వరకు నివాసముంటున్నారు. ఇప్పుడు ఆ ప్రాంతంలో కరోనా విస్తరిస్తోంది. ఇప్పటి వరకు అక్కడ కరోనా కేసుల సంఖ్య 22కి పెరిగింది.

ఎంతో ఇరుకుగా, అపరిశుభ్రంగా ఉండే ఈ ప్రాంతంలో కరోనా మరింత వేగంగా విస్తరించే అవకాశాలు ఉండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. కనీసం 7 లక్షల మందికి కరోనా పరీక్షలను నిర్వహించాలని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నిర్ణయించారు. ఈ ప్రాంతంలో నివాసముండే 50 మంది తబ్లిగ్ జమాత్ సమావేశానికి కూడా వెళ్లొచ్చారు. మరోవైపు ముంబై అగ్నిమాపక శాఖ సిబ్బంది ధారావి ప్రాంతాన్ని శానిటైజ్  చేస్తున్నారు.

  • Loading...

More Telugu News