Narendra Modi: ఇజ్రాయెల్ ప్రధాని, బ్రెజిల్‌ అధ్యక్షుల ట్వీట్లు... ప్రధాని మోదీ స్పందన

modi replies to netanyahu

  • భారత్‌ నుంచి ఇజ్రాయెల్‌కు ఔషధాలు
  • బ్రెజిల్‌కు కూడా క్లోరోక్విన్‌ ముడి సరుకు పంపిన భారత్
  • ఇరు దేశాలు కృతజ్ఞతలు
  • కరోనాపై కలిసి పోరాడదామన్న మోదీ

కరోనా విజృంభణ నేపథ్యంలో తమ దేశానికి ఔషధాలు పంపినందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ట్వీట్‌ను రీట్వీట్‌ చేసిన మోదీ ఆయన చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.

'మనందరం కలిసి కరోనాపై పోరాడాల్సి ఉంది. తన స్నేహితులకు వీలైన సాయాన్ని చేయడానికి భారత్ సిద్ధంగా ఉంది. ఇజ్రాయెల్‌ ప్రజల క్షేమం, ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నాను' అని మోదీ పేర్కొన్నారు.  

కాగా, తమ దేశానికి ఔషధాలు పంపినందుకు గానూ నెతన్యాహు స్పందిస్తూ.. 'ఇజ్రాయెల్‌కు క్లోరోక్లిన్‌ పంపినందుకు డియర్ ఫ్రెండ్‌ మోదీ మీకు కృతజ్ఞతలు' అని ట్వీట్ చేశారు.

కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న నేపథ్యంలో ఇప్పటివకే పలు దేశాలకు సాయం చేసిన భారత్‌.. ఇజ్రాయెల్‌కు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను పంపింది. ప్రత్యేక విమానంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్‌తో పాటు ఇతర ఔషధాలు (దాదాపు 5 టన్నులు) ఇజ్రాయెల్‌ చేరుకున్నాయి.  

ఏప్రిల్‌ 3న భారత ప్రధాని మోదీతో నెతన్యాహు మాట్లాడి తమకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ కావాలని కోరారు. ఈ నేపథ్యంలో ఆ దేశానికి భారత్‌ ఆ ఔషధాన్ని పంపింది. కరోనా విజృంభణ ప్రారంభమైన నాటి నుంచి మోదీతో నెతన్యాహు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు.  

బ్రెజిల్‌ అధ్యక్షుడికి మోదీ రిప్లై..

                       
కాగా,  ప్రధాని నరేంద్ర మోదీకి బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బోల్సోనారో ఇటీవల కృతజ్ఞతలు తెలిపిన విషయం తెలిసిందే. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ తయారీకి అవసరమైన ముడిసరుకులను బ్రెజిల్‌కు భారత్ ఇటీవల ఎగుమతి చేసింది. ఈ నేపథ్యంలో బోల్సోనారో మోదీకి, భారత ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

దీనిపై కూడా స్పందించిన మోదీ.. 'థ్యాంక్యూ బొల్సోనారో.. భారత్‌, బ్రెజిల్ భాగస్వామ్యం ప్రస్తుత పరిస్థితుల్లో మునుపెన్నడూ లేనంత బలంగా ఉంది. కరోనా మహమ్మారిపై పోరాడేందుకు మానవాళికి సాయం చేసేందుకు భారత్‌ నిబద్ధతతో ఉంది' అని తెలుపుతూ ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News