Corona Virus: భారత్‌లో మరిన్ని పెరిగిన కరోనా కేసులు.. మరణాలు

coronavirus cases in india

  • కరోనా బాధితుల సంఖ్య 6,412
  • కరోనా వల్ల మృతి చెందిన వారు 199 మంది
  • 24 గంటల్లో కొత్తగా 33 మంది మృతి
  • ఇప్పటివరకు కోలుకున్న వారు 504 మంది

భారత్‌లో కరోనా కేసులు, మరణాల సంఖ్య మరింత పెరిగిపోయింది. ఇప్పటివరకు కరోనా బాధితుల సంఖ్య 6,412కు చేరిందని కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. దేశంలో కరోనా వల్ల 199 మరణాలు సంభవించాయి.  24 గంటల్లో కొత్తగా 33 మంది ప్రాణాలు కోల్పోయారు.  

ఇప్పటివరకు 504 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 5,709 మందికి చికిత్స అందుతోంది. మహారాష్ట్రలో అత్యధికంగా 1364 మంది బాధితులున్నారు. వారిలో 125 మంది కోలుకోగా, 97 మంది ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులో 834 మందికి కరోనా సోకింది. వారిలో 21 మంది కోలుకోగా ఎనిమిది మంది మృతి చెందారు.

ఢిల్లీలో 720 మందికి కరోనా సోకగా 25 మంది కోలుకున్నారు.12 మంది మృతి చెందారు. రాజస్థాన్‌లో 463 మందికి కరోనా సోకగా వారిలో21 మంది కోలుకున్నారు. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలో 471 మందికి కరోనా సోకగా 45 మంది కోలుకున్నారు. 12 మంది మృతి చెందారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లో 410 మందికి కరోనా సోకగా 31 మంది కోలుకున్నారు. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్‌లో 363 మందికి కరోనా సోకగా ఆరుగురు కోలుకున్నారు. నలుగురు మృతి చెందారు. కేరళలో 357 మందికి కరోనా సోకగా 96 మంది కోలుకున్నారు. ఇద్దరు మృతి చెందారు. మధ్యప్రదేశ్‌లో 259 మందికి కరోనా సోకగా 16 మంది మృతి చెందారు.

  • Loading...

More Telugu News