31వ సినిమా కోసం కథలు వింటున్న ఎన్టీఆర్
- ఎన్టీఆర్ 30వ చిత్రం త్రివిక్రమ్ తో
- తదుపరి సినిమా ఆలోచనలో ఎన్టీఆర్
- కథలను వినిపిస్తున్న యువ దర్శకులు
లాక్ డౌన్ కారణంగా ఎన్టీఆర్ ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ ఖాళీ సమయంలోనే 31వ సినిమాకి సంబంధించిన కథను సెట్ చేయాలనే ఉద్దేశంతో, కొంతమంది యువ దర్శకులకు సంకేతాలు పంపించాడట. వాళ్లంతా కూడా తమ దగ్గరున్న కథల్లో, ఎన్టీఆర్ ఇమేజ్ కి తగిన కథలను వినిపిస్తున్నట్టు తెలుస్తోంది. కథలో కొత్తదనం .. పాత్రలో వైవిధ్యానికి ప్రాధాన్యతనిస్తూ, ఇంతవరకూ టచ్ చేయని సబ్జెక్ట్ ను చేయాలనే ఆలోచనతో ఎన్టీఆర్ కథలను వింటున్నాడు. చివరికి ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో చూడాలి మరి.