Kollu Ravindra: లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘన.. టీడీపీ నేత కొల్లు రవీంద్రను అడ్డుకున్న పోలీసులు!
![Kollu Ravinda has arrested](https://imgd.ap7am.com/thumbnail/tn-64dca1efa27a.jpg)
- పెడన క్వారంటైన్ కు వెళ్లేందుకు యత్నించిన రవీంద్ర
- పోలీసులకు, ఆయన అనుచరులకు మధ్య వాగ్వాదం
- రవీంద్రపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామన్న అడిషనల్ ఎస్పీ
లాక్ డౌన్ ను ఉల్లంఘించి కృష్ణా జిల్లాలోని పెడన క్వారంటైన్ కు వెళ్లేందుకు యత్నించిన ఏపీ టీడీపీ నేత కొల్లు రవీంద్రను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, పోలీసులకు, కొల్లు రవీంద్ర అనుచరులకు మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ విషయమై అడిషనల్ ఎస్పీ మోకా సత్తిబాబు మాట్లాడుతూ, రవీంద్రపై ఐపీసీ సెక్షన్ 188, ఎపిడమిక్ యాక్టు 1987 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని చెప్పారు.