Allu Arjun: ఫస్టులుక్ తోనే అత్యధిక లైక్స్ ను దక్కించుకున్న 'పుష్ప'

Pushpa Movie

  • అల్లు అర్జున్ తాజా చిత్రంగా 'పుష్ప'
  • త్వరలో రెగ్యులర్ షూటింగ్ 
  • ప్రతినాయకుడిగా విజయ్ సేతుపతి

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ 'పుష్ప' సినిమా చేస్తున్నాడు. లాక్ డౌన్ ఎత్తేయగానే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో నిన్న బన్నీ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని, ఆయన ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. మొరటువాడైన కుర్రాడిగా బన్నీ లుక్ కొత్తగా వుంది. ఆయన అభిమానులను ఈ లుక్ ఆకట్టుకుంది.

ఇటీవల కాలంలో తెలుగులో ట్విట్టర్ ద్వారా వదిలిన ఫస్టులుక్ పోస్టర్స్ లో చాలా వేగంగా అత్యధిక లైక్స్ ను దక్కించుకున్న ఫస్టులుక్ పోస్టర్ గా 'పుష్ప' కొత్త రికార్డును సొంతం చేసుకుంది. ఎర్రచందనం దుంగలను అక్రమంగా రవాణ చేసే ముఠా సభ్యుడిగా ఈ సినిమాలో అల్లు అర్జున్ కనిపించనున్నాడు. ఆయన సరసన నాయికగా రష్మిక అలరించనుంది. ఇక ప్రతినాయకుడిగా విజయ్ సేతుపతి చేయనున్నాడనే సంగతి తెలిసిందే.

Allu Arjun
Rashmika Mandanna
Pushpa Movie
  • Loading...

More Telugu News