Nimmakayala Chinarajappa: కరోనా కంటే జగన్ కు ఇతర అంశాలపైనే శ్రద్ధ ఎక్కువ: చినరాజప్ప

Chinarajappa fires on Jagan

  • కరోనా నియంత్రణకు ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి
  • ప్రశ్నించిన వైద్యుడిని సస్పెండ్ చేశారు
  • కరోనా తీవ్రతను ప్రభుత్వం అర్థం చేసుకోవడం లేదు

కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యతను తీసుకోవాలని టీడీపీ నేత, మాజీ హోం మంత్రి చినరాజప్ప డిమాండ్ చేశారు. సరైన సదుపాయాలు లేక  వైద్యులు ఇబ్బంది పడుతున్నారని... చివరకు కోర్టులను కూడా ఆశ్రయిస్తున్నారని చెప్పారు. వైద్యుల ప్రాణాలకు ముప్పు ఉందని చెపితే... నర్సీపట్నంలోని వైద్యుడిని సస్పెండ్ చేశారని విమర్శించారు. కరోనా తీవ్రతను ప్రభుత్వం అర్థం చేసుకోవడం లేదని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ కు కరోనా కంటే ఇతర అంశాలపైనే ఎక్కువ శ్రద్ధ అని దుయ్యబట్టారు. కంకర, ఇసుక దోచుకోండని ముఖ్యమంత్రి ఆదేశించినట్టుగా వైసీపీ నేతలు ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.


Nimmakayala Chinarajappa
Telugudesam
Jagan
YSRCP
Corona Virus
  • Loading...

More Telugu News