Jaya Bachchan: అందరూ ప్రేమగా పిలుచుకునే పదమే అమ్మ .. తల్లికి జన్మదిన శుభాకాంక్షలు అందజేసిన అభిషేక్ బచ్చన్

Abhishek Bachchan

  • ఈ రోజున జయాబచ్చన్ పుట్టినరోజు 
  • లాక్ డౌన్ కారణంగా ఢిల్లీలో వుండిపోయిన జయాబచ్చన్
  • తల్లిపట్ల ప్రేమను చాటుకున్న అభిషేక్ బచ్చన్

బాలీవుడ్ నిన్నటితరం కథానాయికగా .. అమితాబ్ అర్థాంగిగా .. అభిషేక్ బచ్చన్ తల్లిగా జయా బచ్చన్ కీలకమైన పాత్రను పోషిస్తూ వచ్చారు. ప్రతి విషయంలోను హుందాగా వ్యవహరించడం ఆమె ప్రత్యేకత. అలాంటి జయాబచ్చన్ పుట్టినరోజు .. ఈ రోజు. 72వ వసంతంలోకి ఆమె అడుగుపెట్టారు.

ఈ సందర్భంగా అభిషేక్ బచ్చన్ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ .. "పిల్లలంతా ఎంతో ప్రేమగా పలికే పదం 'అమ్మా'. అలాంటి మా అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు' అంటూ తల్లిపట్ల తనకి గల ప్రేమానురాగాలను చాటుకున్నాడు. లాక్ డౌన్ సమయంలో ఢిల్లీలో వున్న జయాబచ్చన్, అక్కడే వుండిపోవలసి వచ్చింది. దాంతో ముంబైలో వున్న అభిషేక్ బచ్చన్ కి తన తల్లిని కలుసుకునే అవకాశం లేకుండాపోయింది. అందువలన ఆయన సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు అందజేస్తూ "అమ్మా నువ్వు ఎక్కడ వున్నా మేమంతా నీ గురించే ఆలోచిస్తుంటాము .. మా గుండెల్లో నువ్వు ఎప్పటికీ ఉంటావు .. ఐ లవ్ యు' అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు.

Jaya Bachchan
Abhishek Bachchan
Birthday Wishes
  • Loading...

More Telugu News