Mumbai Police: 21 రోజుల లాక్ డౌన్ అవకాశం మాకు లభిస్తే... వైరల్ అవుతున్న ముంబయి పోలీసుల వీడియో!

Mumbai Police Video Viral on Lockdown

  • లాక్ డౌన్ వేళ విధుల్లో పోలీసులు
  • నిద్రాహారాలు మాని శ్రమిస్తున్న వైనం
  • అవకాశం లభిస్తే ఇల్లు దాటబోమంటున్న పోలీసులు

దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్ డౌన్ అమలవుతోంది. ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించాయి. అత్యవసరమైతే తప్ప బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇక, లాక్ డౌన్ ను సక్రమంగా అమలు చేయడం, ప్రజలు సామాజిక దూరం పాటించడాన్ని పర్యవేక్షించడంతో పాటు, శాంతి భద్రతల పరిరక్షణ విధుల్లో ఉన్న పోలీసులు మాత్రం రోడ్లపైనే ఉన్నారు. పోలీసులతో పాటు వైద్యులు, శానిటేషన్ సిబ్బంది, హెల్త్ వర్కర్లు, నిద్రాహారాలు మాని కరోనా వ్యాప్తి నిరోధానికి శ్రమిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ముంబయి పోలీసులు పెట్టిన ఓ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. సమయ పాలన లేకుండా 24/7 విధుల్లో ఉండే పోలీసు సిబ్బందికే 21 రోజుల లాక్ డౌన్ అందుబాటులోకి వస్తే... ఈ ప్రశ్నను కొందరు పోలీసులను అడిగి, వారిచ్చిన సమాధానాలను 'ముంబయి పోలీస్' ట్విట్టర్ అధికారిక ఖాతాలో పెట్టారు. ఈ అవకాశం తమకు లభిస్తే, గడపదాటి కాలు బయట పెట్టబోమని, తమ కుటుంబంతో, పిల్లలతో గడిపే సమయం లభించిందని ఆనందిస్తామని ఈ వీడియోలో పోలీసులు చెబుతున్నారు.

Mumbai Police
Corona Virus
Lockdown
  • Error fetching data: Network response was not ok

More Telugu News