shivraj singh chauhan: బయటకొస్తారా? లేక క్రిమినల్ చర్యలను ఎదుర్కొంటారా?: జమాత్ సభ్యులకు మధ్యప్రదేశ్ సీఎం వార్నింగ్
![Shivraj Singh Chauhan warns Tablighi Jamaat members](https://imgd.ap7am.com/thumbnail/tn-3df42f70da91.jpg)
- తప్పించుకు తిరుగుతున్న కొందరు జమాత్ సభ్యులు
- 24 గంటల సమయం ఇచ్చిన చౌహాన్
- స్వయంగా బయటకు వచ్చి లొంగిపోవాలని వార్నింగ్
ఢిల్లీలోని నిజాముద్దీన్ లో జరిగిన తబ్లిగీ జమాత్ కు హాజరైన వేలాది మంది... ఆ తర్వాత తమ సొంత ప్రదేశాలకు వెళ్లిపోయారు. ఈ క్రమంలో వీరి వల్ల దేశంలో కరోనా వైరస్ ఊహించని విధంగా విస్తరించింది. వీరిలో చాలా మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, క్వారంటైన్లలో చికిత్స పొందుతున్నారు. మరికొందరు మాత్రం ప్రభుత్వ హెచ్చరికలను సైతం లెక్కచేయకుండా తప్పించుకు తిరుగుతున్నారు. అలాంటి వారికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
24 గంటల సమయం మాత్రమే ఇస్తున్నామని... ఈలోగా రాష్ట్రంలో దాక్కున్న వారంతా బయటకు వచ్చి అధికారులకు లొంగిపోవాలని శివరాజ్ సింగ్ చౌహాన్ హుకుం జారీ చేశారు. లొంగిపోని వారంతా క్రిమినల్ చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.