Corona Virus: భారత్‌లో మరింత పెరిగిన కరోనా కేసులు, మృతుల సంఖ్య
- ఇప్పటివరకు 5,194 కేసులు
- 4,643 మందికి ఆసుపత్రుల్లో చికిత్స
- 24 గంటల్లో ఏకంగా 773 కరోనా కేసులు
- ఇదే సమయంలో 10 మంది మృతి
భారత్‌లో కరోనా కేసులు, మృతుల సంఖ్య మరింత పెరిగాయి. ఇప్పటివరకు 5,194 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. వారిలో 4,643 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది.
ఇప్పటివరకు 401 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. 149 మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్‌లో 24 గంటల్లో ఏకంగా 773 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు.
కరోనా వ్యాప్తి కట్టడికి లాక్‌డౌన్ అమలులో ఉన్నప్పటికీ కొత్త కేసులు భారీగా నమోదు అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 1,018కి చేరింది. తమిళనాడులో 690కి పెరిగింది. ఢిల్లీలో 576 కేసులు నమోదయ్యాయి. రాజస్థాన్‌లో కొత్తగా 15 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 343కి చేరింది. పలు రాష్ట్రాల్లోనూ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోయింది.