గుంటూరులో కొత్తగా 8 పాజిటివ్ కేసులు.. కొన్ని ప్రాంతాలు రెడ్ జోన్లుగా గుర్తింపు
- ఇప్పటి వరకు 41 కేసులు నమోదు అయ్యాయి
- అందులో 27 కేసులు గుంటూరులోనే
- రెడ్ జోన్లుగా మంగళదాస్ నగర్, కుమ్మరి బజార్ తదితర ప్రాంతాలు
ఢిల్లీ వెళ్లొచ్చిన వారిని కలిసిన వారు, ‘కరోనా’ లక్షణాలు ఉన్న వారు పరీక్షల నిమిత్తం ముందుకు రావాలని సూచించారు. ఆర్ఎంపీ వైద్యులు తమ క్లినిక్ లను మూసివేయాలని ఆదేశించారు. ప్రైవేట్ ఆసుపత్రులకు అనుమానితులు వస్తే నోటిఫై చేయాలని చెప్పారు. నిత్యావసరాల కొనుగోలు చేసే సమయాన్ని ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు కుదించామని తెలిపారు.