Manchu Lakshmi: నీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ చెప్పు తమ్ముడు: నెటిజెన్ కు మంచు లక్ష్మి దిమ్మతిరిగే సమాధానం

Manchu Lakshmi gives strong reply to a Netizen

  • నెట్ ఫ్లిక్స్ ఐడీ షేర్ చేయమన్న నెటిజన్
  • బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడిగిన లక్ష్మి
  • ఆన్ లైన్ షాపింగ్ చేసుకుంటానంటూ సమాధానం

ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు మంచు లక్ష్మికి చిర్రెత్తుకొచ్చింది. అతనికి దిమ్మతిరిగే సమాధానమిచ్చింది. అసలేం జరిగిందంటే... సోషల్ మీడియాలో మంచు లక్ష్మి చాలా యాక్టివ్ గా ఉంటారనే విషయం తెలిసిందే. ఎన్నో విషయాలపై ఆమె తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటుంది. తాజాగా ఆమె ఓ ట్వీట్ చేసింది. అయితే ఓ నెటిజన్ నుంచి ఆమెకు ఓ రీట్వీట్ వచ్చింది.  'అక్కా మీ నెట్ ఫ్లిక్స్ ఐడీని షేర్ చేయండి' అని అతను కామెంట్ పెట్టాడు. దీనిపై మంచు లక్ష్మి ఘాటుగా స్పందించింది. 'నీ బ్యాంక్ అకౌంట్ డీటైయిల్స్ చెప్పు తమ్ముడు...  ఆన్ లైన్ షాపింగ్ చేసుకుంటా' అని రిప్లై ఇచ్చింది. మరోవైపు, మంచు లక్ష్మి ఇచ్చిన సమాధానాన్ని పలువురు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Manchu Lakshmi
Tweet
Tollywood
Bank Account
  • Loading...

More Telugu News