Short Film: ఇండియన్ సూపర్ స్టార్స్ తో కరణ్ జొహార్ షార్ట్ ఫిల్మ్ 'ఫ్యామిలీ'... ఇదిగో!

Karan Johar Made a Short Film With Indian Superstars

  • కరోనాపై అవగాహన పెంచేలా షార్ట్ ఫిల్మ్
  • అందరూ ఇళ్లలోనే ఉండాలని పిలుపు
  • వైరల్ అవుతున్న వీడియో

కరోనా వైరస్ పై ప్రజల్లో అవగాహన పెంచేలా ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ జొహార్, వివిధ భాషల్లోని సూపర్ స్టార్ లను భాగం చేస్తూ నిర్మించిన 'ఫ్యామిలీ' సోనీ టీవీలో విడుదల కాగా, అప్పటి నుంచి లక్షల వ్యూస్ సాధిస్తూ, ట్రెండింగ్ లోకి వెళ్లిపోయింది. కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న వేళ, ఇళ్లలోనే ఉండాలన్న సందేశాన్ని ఈ షార్ట్ ఫిల్మ్ ఇస్తోంది.

ఇంటి పెద్దగా ఉన్న అమితాబ్, తన సన్ గ్లాసెస్ ను ఎక్కడో పడేసుకుని, వాటిని వెతికే పనిలో ఉండటంతో మొదలయ్యే షార్ట్ ఫిల్మ్, దాన్ని కనుగొనేందుకు పలు భాషలకు చెందిన నటీ నటులు ప్రయత్నించడం, చివరకు సన్ గ్లాసెస్ దొరకడం, ఆపై అమితాబ్ ఇచ్చే చిన్న సందేశంతో ముగుస్తుంది. ఈ షార్ట్ ఫిల్మ్ ను చిత్రీకరించేందుకు ఇందులో నటించిన నటీనటులు ఎవరూ తమతమ ఇళ్ల నుంచి కదల్లేదని, ప్రజలు కూడా ఇళ్లలోనే ఉండాలని అమితాబ్ సందేశాన్ని ఇచ్చారు. ఎవ్వరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. ఈ షార్ట్ ఫిల్మ్ తో భారత సినీ పరిశ్రమ ఒకటేనని చాటినట్లయిందని అన్నారు.

ఇక ఇందులో అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, చిరంజీవి, మోహన్ లాల్, ప్రియాంకా చోప్రాలు కనిపిస్తారు. వీరితో పాటు ఈ షార్ట్ ఫిల్మ్ లో మమ్ముట్టి, రణబీర్ కపూర్, ఆలియా భట్, ప్రసేన్ జిత్ ఛటర్జీ, శివరాజ్ కుమార్, సోనాలీ కులకర్ణి, దల్జిత్ దోస్నాజ్ తదితరులు కూడా నటించడం విశేషం.

  • Error fetching data: Network response was not ok

More Telugu News