Balakrishna: మరోసారి పూరి దర్శకత్వంలో బాలకృష్ణ

puri Jagannadh Movie

  • గతంలో వచ్చిన 'పైసా వసూల్'
  • బాలయ్య కోసం కథపై కసరత్తు 
  •  త్వరలో వినిపించనున్న పూరి   

విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ తాజా చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాకి  'ఫైటర్' .. 'లైగర్' అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు. కరణ్ జొహార్ తో కలిసి పూరి ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తీర్చిదిద్దుతున్నాడు. ఈ సినిమా తరువాత పవన్ కల్యాణ్ తో పూరి సినిమా ఉండొచ్చనే వార్తలు వినిపించాయి. మహేశ్ బాబుతో సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు వున్నట్టుగా కూడా ప్రచారం జరిగింది.

అయితే తాజాగా బాలకృష్ణ పేరు తెరపైకి వచ్చింది. గతంలో బాలకృష్ణతో పూరి 'పైసా వసూల్' సినిమా చేశాడు. ఆ సినిమా అంతగా ఆడకపోయినా, బాలయ్యను కొత్తగా చూపించడంలో మంచి మార్కులు కొట్టేశాడు. అప్పటి నుంచి ఆయనకి బాలయ్యతో మంచి సాన్నిహిత్యం వుంది. ఆయనను ఒప్పించగలననే నమ్మకంతో పూరి ఒక కథను సిద్ధం చేస్తున్నాడట. త్వరలోనే బాలయ్యకు ఆ కథను వినిపించనున్నాడని అంటున్నారు.

Balakrishna
Puri Jagannadh
Paisa Vasol Movie
  • Loading...

More Telugu News