kangana Ranaut: నేనింతే .. ఇష్టమైతేనే చేస్తాను: కంగనా రనౌత్

Kangana

  • హీరో ఎవరైనా పట్టించుకోను 
  • పాత్ర బాగుంటేనే చేస్తాను 
  • తన నిర్ణయం మారదన్న

బాలీవుడ్ కథానాయికలలో కంగనా స్థానం ప్రత్యేకం. తనకి తోచింది మాత్రమే చేస్తుంది .. ఎవరి కోసం కాంప్రమైజ్ కాదు అనే కామెంట్ ఆమెపై వుంది. తాజాగా కంగనా కూడా అదే మాటను అంగీకరించింది. "నిజమే నేను నాకు నచ్చిన పనులను మాత్రమే చేస్తాను .. నాకు ఇష్టమైన పాత్రలనే అంగీకరిస్తాను. స్టార్ హీరోల సరసన అవకాశమే అయినా, పాత్ర పరంగా ప్రాధాన్యత లేకపోతే నేను ఒప్పుకోను.

సల్మాన్ సరసన 'సుల్తాన్'లో చేసే అవకాశం వచ్చింది. అనుష్క శర్మ చేసిన పాత్ర కోసం ముందుగా నన్నే అడిగారు. కొన్ని కారణాల వలన చేయనని చెప్పాను. అందుకు ఆ నిర్మాతకి కోపం వచ్చినా నేను పెద్దగా పట్టించుకోలేదు. ఇక రణబీర్ కపూర్ జోడీగా 'సంజూ' చేసే ఛాన్స్ కూడా ముందుగా నాకే వచ్చింది. ఆ పాత్ర నా స్థాయికి తగినది కాదనే చేయలేదు. రణ బీర్ స్వయంగా కాల్ చేసినా నో అనేశాను" అంటూ చెప్పుకొచ్చింది.

kangana Ranaut
Salman
Ranbir Kapoor
  • Loading...

More Telugu News