Lavanya Tripathi: 'బంగార్రాజు' సినిమాలో లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi

  • నిదానంగా సాగుతున్న కెరియర్ 
  • 'అర్జున్ సురవరం'తో హిట్
  • నాగ్ మూవీలో మళ్లీ అవకాశం 

లావణ్య త్రిపాఠి తన కెరియర్ ను మొదలుపెట్టి చాలా కాలమే అయింది. అయితే ఆశించిన స్థాయిలో ఆమె కెరియర్ జోరందుకోలేదు. అలా ఒక్కొక్కటిగా సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. ఇటీవల 'అర్జున్ సురవరం' తో హిట్ అందుకున్న ఆమె, ప్రస్తుతం సందీప్ కిషన్ జోడిగా ఒక సినిమా, కార్తికేయ సరసన ఒక సినిమా చేస్తోంది.

ఇక 'బంగార్రాజు' సినిమాలోను ఆమెకి ఛాన్స్ దక్కిందనే టాక్ వినిపిస్తోంది. 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాలో యంగ్ నాగార్జున సరసన లావణ్య త్రిపాఠి అలరించింది. ఆ సినిమాకి సీక్వెల్ గానే 'బంగార్రాజు' రూపొందుతోంది. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో .. అన్నపూర్ణ బ్యానర్లో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమాలో లావణ్య త్రిపాఠికి అవకాశం లభించింది. కథానాయికగా లావణ్య త్రిపాఠిని తీసుకున్నారా? లేదంటే వేరే కీలకమైన పాత్ర కోసం ఎంపిక చేసుకున్నారా? అనేది తెలియాల్సి వుంది.

Lavanya Tripathi
Nagarjuna
Bangaraju Movie
  • Loading...

More Telugu News