North Korea: 'మాది కరోనా ఫ్రీ కంట్రీ' అని ప్రకటించిన ఉత్తరకొరియా.. అనుమానంగా చూస్తున్న ప్రపంచ దేశాలు
- కరోనా కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్న ప్రపంచం
- అయినా తమ దేశంలో ఒక్క కేసు కూడా లేదని ప్రకటన
- చైనాలో కేసు నమోదైన వెంటనే సరిహద్దులు మూసేశామన్న నార్త్ కొరియా
ప్రపంచం మొత్తం కరోనా గుప్పిట్లో చిక్కుకుని విలవిల్లాడుతుంటే ఉత్తర కొరియా మాత్రం ఇందుకు విరుద్ధ ప్రకటనలు చేస్తోంది. తమ దేశంలో అసలు కరోనా కేసులే లేవని, తమది పూర్తిగా కరోనా ఫ్రీ కంట్రీ అని చెబుతోంది. తమ దేశంలోకి వైరస్ ప్రవేశించలేదని ఆ దేశ ఆరోగ్యశాఖ సీనియర్ అధికారి ఒకరు నిన్న ప్రకటించారు.
చైనాలో తొలి కరోనా కేసు బయటపడిన తర్వాత అప్రమత్తమై దేశ సరిహద్దులను మూసివేయడం వల్లే తమ దేశంలోకి కరోనా వైరస్ ప్రవేశించలేకపోయిందని ఆ దేశ యాంటీ-ఎపిడమిక్ విభాగం డైరెక్టర్ పాక్ మియాంగు సూ తెలిపారు. అయితే, ఉత్తరకొరియా ప్రకటనపై ప్రపంచ దేశాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రపంచం మొత్తం కరోనా గుప్పిట్లో చిక్కుకుని విలవిల్లాడుతుంటే తమది కరోనా ఫ్రీ కంట్రీ అని పేర్కొనడం అనుమానాలకు తావిస్తోందని నిపుణులు చెబుతున్నారు.