smart phones: భారత్‌లో పెరిగిన స్మార్ట్‌ఫోన్‌ల ధరలు

Mobile companies increase smartphone prices due to GST hike

  • స్మార్ట్‌ఫోనులపై పెరిగిన జీఎస్టీ
  • కొత్త ధరలను ప్రకటిస్తున్న సంస్థలు
  • దాదాపు 5 శాతం పెరుగుదల

మొబైల్‌ ఫోన్లపై పన్నులను 12 శాతం నుంచి 18 శాతానికి పెంచుతున్నట్లు గత నెలలో వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) మండలి ప్రకటించింది. దీంతో దేశంలో మొబైల్ ఫోన్ల ధరలు పెరుగుతున్నాయి. యాపిల్, షియోమీ, సామ్‌సంగ్‌, పొకొ, రియల్‌మీ వంటి సంస్థలు స్మార్ట్‌ఫోన్‌ ధరలను పెంచేశాయి.

తాజాగా కొత్త ధరలను ప్రకటిస్తున్నాయి. కొత్త మోడళ్లపైనే కాకుండా పాత మోడళ్లపై కూడా ధరలు పెంచుతుండడం గమనార్హం. ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌, ఐఫోన్‌7 వంటి వాటిపై ఐదు శాతం చొప్పున ధరలు పెంచుతున్నట్లు యాపిల్‌ ప్రకటించింది.
 
  • ఐఫోన్‌ 11 ప్రో మ్యాక్స్‌ (64జీబీ) ధర ఇంతకు ముందు రూ.1,11,200 గా ఉండేది. ఇప్పుడు దాని ధర 1,17,100కు చేరింది.
  • ఐఫోన్‌ 11 ప్రో (64 జీబీ) ఇంతకు ముందు రూ.1,01,200గా ఉండేది. ఇప్పుడు రూ.1,06,600కు చేరింది.
  • 64 జీబీ ఐఫోన్‌ 11 ఇప్పుడు రూ.68,300కి చేరింది. ఇంతకు ముందు దీని ధర 64,900గా ఉండేది.
  • ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌ (64జీబీ) ఇప్పుడు 52,000 రూపాయలకు చేరింది. ఇంతకు ముందు దీని ధర 49,900 రూపాయలుగా ఉండేది.
  • సామ్‌సంగ్‌ కూడా కొత్త ధరలను ప్రకటించింది. న్యూ సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎస్‌20 ఇప్పుడు రూ.70,500గా ఉంది.
  • సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎస్‌20 ప్లస్‌ ఇప్పుడు రూ.77,900కు చేరింది.
  • సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎస్‌20 అల్ట్రా ఇప్పుడు రూ.97,900కు చేరింది.
  • అలాగే, షియోమీ, పొకొ, ఒప్పో, రియల్‌మీ స్మార్ట్‌ఫోన్ల ధరలు కూడా పెరిగాయి. వీటి ధరలను ఆయా సంస్థల వెబ్‌సైట్లలో చూడొచ్చు.

  • Loading...

More Telugu News