Ramakishna: ఢిల్లీలో ప్రార్థనలకు వెళ్లి వచ్చిన ముస్లింలు స్వచ్ఛందంగా రక్త పరీక్షలకు రావాలి!: సీపీఐ రామకృష్ణ

CPI Ramakrishna Comments on Markaz

  • విద్వేషాలు పెంచే కుట్ర జరుగుతోంది
  • ప్రజలు జాగ్రత్తగా ఉండాలి
  • ప్రార్థనలకు వెళ్లిన వారు రక్త పరీక్షలకు ముందుకు రావాలన్న రామకృష్ణ

కరోనా మహమ్మారికి మతం రంగు పులిమే కుట్ర జరుగుతోందని, ఇటువంటి పనులు చేయవద్దని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. కొందరు కావాలనే మర్కజ్ ప్రార్థనలవల్లే వైరస్ వ్యాపిస్తోందని దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు.

తాజాగా అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైరస్ కు మతం రంగు పులమడం వల్ల దేశంలోని ప్రజల మధ్య చీలికలు, విద్వేషాలు వస్తాయని ఆయన హెచ్చరించారు. విద్వేషాలు పెంచే శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఢిల్లీలో జరిగిన ప్రార్థనలకు వెళ్లి వచ్చిన ముస్లింలు స్వచ్ఛందంగా రక్త పరీక్షలకు ముందుకు రావాలని ఆయన కోరారు. కరోనాను తరిమేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని, ప్రజలంతా ప్రభుత్వాలకు సహకరించాలని సూచించారు. భౌతిక దూరాన్ని పాటించడమే కరోనాకు ఔషధమని అన్నారు.

  • Loading...

More Telugu News