Sai kumar: కనిపించే మూడు సింహాలు డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు: నటుడు సాయికుమార్

Artist Sai kumar priases Doctors and police

  • కనిపించని నాల్గో సింహాం ‘మీరు’
  • ‘మీరు’ అంటే మనం.. ‘మనం’ అంటే దేశం
  •  ఆ మహమ్మారి నుంచి ప్రపంచాన్ని కాపాడదాం 

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చేసే పోరాటానికి ప్రతి ఒక్కరూ కలిసి రావాలని, బయటకు రాకుండా ఇళ్లలోనే ఉండి ప్రాణాలను కాపాడుకోవాలని ప్రభుత్వం, రాజకీయ నేతలు, సెలెబ్రిటీలు పిలుపు నిస్తున్న విషయం తెలిసిందే. నటుడు, ‘డైలాగ్ కింగ్’ సాయికుమార్ ఇదే విషయాన్ని చెబుతూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. ‘

కనిపించే మూడు సింహాలు డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు అయితే కనిపించని నాల్గో సింహాం ‘మీరు’.  ‘మీరు’ అంటే మనం, ‘మనం’ అంటే దేశం..’ అంటూ ఆ వీడియోలో చెప్పారు. మనం అందరం కలిసికట్టుగా పోరాడదామని, ఆ వైరస్ ను తరిమి కొడదామని, ‘ఆ మహమ్మారి నుంచి ప్రపంచాన్ని కాపాడదాం’ అని పిలుపు నిచ్చారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News