Savitri: సావిత్రిని అలా చూసి తట్టుకోలేకపోయాను: 'షావుకారు' జానకి

shavukaru janaki abot Savitri

  • సావిత్రి, నేను ఎంతో చనువుగా ఉండేవాళ్లం 
  •  ఆమె కళ్ల వెంట నీళ్లు చూసి కదిలిపోయాను 
  •  పిల్లల గురించి ఆమె ఆలోచన చేయకపోవడమే బాధ 

సావిత్రికి .. 'షావుకారు' జానకి మధ్య మంచి సాన్నిహిత్యం వుంది. ఓ ఇంటర్వ్యూలో 'షావుకారు' జానకి దీని గురించి మాట్లాడుతూ, "సావిత్రి .. నేను ఎంతో చనువుగా ఉండేవాళ్లం. ఇద్దరం ఒకేలాంటి నగలు చేయించుకునేవాళ్లం. చివరి రోజుల్లో నేను సావిత్రి దగ్గరికి వెళ్లాను. మంచానికి అంటుకుపోయి వున్న ఆమె, నెమ్మదిగా తలతిప్పి నా వైపు చూసింది. నాతో ఆమె ఏమీ మాట్లాడలేకపోయింది. ఆమె కళ్ల వెంట నీళ్లు కారిపోయాయి.

ఎంత గొప్ప నటి .. ఎందుకు తనపై తనకి కంట్రోల్ లేకుండా పోయింది .. కనీసం పిల్లల గురించి కూడా ఆలోచించలేదే అనిపించింది. జీవితంలో సమస్యలను ఎదుర్కుంటూ ముందుకు వెళ్లాలి. మన బలహీనతలను బయటపెట్టుకోవడానికి ఎంతో సేపు పట్టదు. పిల్లలను ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చినప్పుడు, వాళ్ల గురించిన ఆలోచన ఆమె ఎందుకు చేయలేకపోయిందనే నేను బాధపడుతూ వుంటాను.

Savitri
Shavukaru janaki
Tollywood
  • Loading...

More Telugu News