Savitri: సావిత్రికి, నాకూ మధ్య ఎలాంటి మనస్పర్థలు ఉండేవి కాదు: షావుకారు జానకి

shavukaru janaki

  • సావిత్రి నేను కలిసి నటించాము 
  • మా మధ్య మంచి స్నేహం వుంది 
  • ఇదంతా పుకారు మాత్రమేనన్న షావుకారు జానకి 

తెలుగు తెరపై కథానాయికగా ఒక వైపున సావిత్రి చక్రం తిప్పేస్తుంటే, మరో వైపున తనకి తగిన పాత్రలను షావుకారు జానకి పోషిస్తూ వచ్చింది. ఈ ఇద్దరి మధ్య మనస్పర్థలు ఉండేవని ఒక ప్రచారం వుంది. ఆ విషయాన్ని గురించి షావుకారు జానకి మాట్లాడుతూ .. "సావిత్రితో నేను కలిసి నటించాను .. మేము ఇద్దరం ఎంతో స్నేహంగా ఉండేవాళ్లం. ఒకరిని ఒకరు ఒక్క మాట అనుకున్నది లేదు.

కథానాయికగా సావిత్రికి నప్పే పాత్రలు వేరు .. నాకు నప్పే పాత్రలు వేరు. సావిత్రి ఎలాంటి పాత్రలకైనా సరిపోతుంది. ఎటువంటి పాత్రలనైనా చేయగలుగుతుంది. ఆమెతో నేను ఎప్పుడూ పోటీపడలేదు .. పోటీపడాలని అనుకోనూ లేదు. సావిత్రిని చూసి నేను ఈర్ష్య పడినట్టుగా కొంతమంది ప్రచారం చేశారు. అందులో ఎంతమాత్రం వాస్తవం లేదు. ఇదంతా కొంతమంది కావాలని చేసిన పుకారు" అని చెప్పుకొచ్చారు.

Savitri
Shavukaru Janaki
Tollywood
  • Loading...

More Telugu News