Ramoji Rao: రామోజీరావుకు కృతజ్ఞతలు తెలిపిన కేటీఆర్

KTR thanks Ramoji Rao

  • రెండు తెలుగు రాష్ట్రాలకు రామోజీరావు విరాళం
  • ఒక్కో రాష్ట్రానికి రూ. 10 కోట్ల చొప్పున విరాళం
  • కరోనాపై పోరుకు మద్దతుగా నిలిచారంటూ కేటీఆర్ ట్వీట్

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ పై పోరాటం చేస్తున్న తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు విరాళాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. రెండు రాష్ట్రాలకు రూ. 10 కోట్ల చొప్పున మొత్తం రూ. 20 కోట్ల విరాళాన్ని ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో రామోజీరావుకు  తెలంగాణ మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. 'కరోనా వైరస్ పై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పోరుకు మద్దతుగా నిలిచి... ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 10 కోట్ల విరాళం ప్రకటించిన శ్రీ రామోజీరావు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు' అని ట్వీట్ చేశారు.

Ramoji Rao
Eenadu
KTR
TRS
Corona Virus
  • Loading...

More Telugu News