Siddipet District: సిద్దిపేట జిల్లాలో కలకలం... గజ్వేల్‌లో తొలికరోనా కేసు నమోదు

corona tension in siddipet

  • పట్టణానికి చెందిన 51 ఏళ్ల వ్యక్తికి పాజిటివ్ 
  • బాధితుడు ఢిల్లీ జమాత్ కార్యక్రమానికి హాజరైనట్లు గుర్తింపు 
  • హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలింపు

సిద్దిపేటలో ఈరోజు కరోనా కలకలం సృష్టించింది. గజ్వేల్ పట్టణానికి చెందిన యాభై ఒక్క ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలడమే ఈ కలకలానికి కారణం. ఇతను ఇటీవల ఢిల్లీలో జరిగిన మతపరమైన కార్యక్రమం తబ్లిగీ జమాతీకి హాజరై వచ్చినట్లు గుర్తించారు.


 రెండు రోజుల క్రితం ఇతనిలో అనుమానిత లక్షణాలు కనిపించడంతో గొంతు నుంచి శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపించారు. పాజిటివ్ రావడంతో అప్రమత్తమైన అధికారులు బాధితుడిని హుటాహుటిన హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి హాజరైన వారిలో ఆరుగురు సిద్దిపేటకు చెందిన వారని గుర్తించిన అధికారులు వెంటనే వారిని క్వారంటైన్ కు తరలించారు. అందులో ఇద్దరి నుంచి శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపగా ఇతనికి పాజిటివ్ అని వచ్చింది. మరో వ్యక్తి నివేదిక రావాల్సి ఉంది.

 

Siddipet District
gajwel
Corona Virus
first case
  • Loading...

More Telugu News