Anjali: నా పనై పోయిందని హేళన చేసినవాళ్లు ఎక్కువ: హీరోయిన్ అంజలి

Anjali

  • అవకాశాల కోసం ఎదురుచూడలేదు
  • నన్ను ఓదార్చినవారు చాలా తక్కువ 
  • సన్నిహితులే హేళన చేశారన్న అంజలి

అంజలి తెలుగు అమ్మాయి అయినప్పటికీ ముందుగా తమిళంలో క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తరువాతనే ఆమెకు తెలుగులో అవకాశాలు వచ్చాయి. తెలుగులోను కథానాయికగా ఆమె వరుస విజయాలను అందుకుంది. అలాంటి అంజలికి కొత్త హీరోయిన్ల పోటీ ఎక్కువ కావడంతో, సహజంగానే అవకాశాలు తగ్గుతూ వచ్చాయి.

తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. "కెరియర్ పరంగా ఎత్తుపల్లాలు ఉండటం సహజం. అవకాశాల కోసం నేను ఎప్పుడూ అంతగా ఎదురుచూడలేదు .. రాలేదని బాధపడలేదు. కానీ ఆ మధ్య మా కుటుంబంలో జరిగిన  గొడవలు అందరి నోళ్లలోను నానాయి.  ఆ సమస్యల కారణంగా నేను బాధపడుతున్నప్పుడు నన్ను ఓదార్చినవారు చాలా తక్కువమంది. నాకు సన్నిహితులుగా వున్నవారే నా గురించి హేళనగా మాట్లాడటం నాకు బాధను కలిగించింది. ఇప్పటికీ ఆ మాటలు నా మనసును గాయపరుస్తూనే ఉంటాయి" అని చెప్పుకొచ్చింది. 

Anjali
Actress
Tollywood
  • Loading...

More Telugu News