Ramoji Rao: కరోనాపై పోరుకు 'ఈనాడు' రామోజీరావు 20 కోట్ల విరాళం!

Ramoji Rao Donetes 10 Crores Each to Telugu States

  • రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో రూ. 10 కోట్లు
  • ఆన్ లైన్ మాధ్యమంలో అకౌంట్లలోకి బదలాయింపు
  • కరోనాపై పోరులో విజయం సాధించాలని ఆకాంక్ష

మీడియా దిగ్గజం, ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు, కరోనాపై పోరుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు భారీ విరాళాన్ని అందజేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ లకు రూ. 10 కోట్ల చొప్పున, మొత్తం రూ. 20 కోట్లను ఆయన విరాళమిచ్చారు.

తనే స్వయంగా కేసీఆర్, వైఎస్ జగన్ లను కలిసి ఈ విరాళాన్ని ఇవ్వాలని రామోజీరావు భావించినా, ప్రస్తుత లాక్ డౌన్ పరిస్థితుల్లో సాధ్యం కాక, ఆ మొత్తాన్ని ఆన్ లైన్ మాధ్యమంగా రిలీఫ్ ఫండ్ ఖాతాల్లో వేస్తున్నారని ఈనాడు గ్రూప్ వర్గాలు తెలిపాయి.

ఈ సందర్భంగా రామోజీరావు మాట్లాడుతూ, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలూ కరోనాపై చేస్తున్న పోరాటంలో విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. కాగా, ముఖ్యమంత్రుల రిలీఫ్ ఫండ్ కు ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు తమవంతు సాయాన్ని అందించిన సంగతి తెలిసిందే.

  • Error fetching data: Network response was not ok

More Telugu News