Sri Reddy: అమలాపాల్ రెండో వివాహంపై శ్రీరెడ్డి కాంట్రవర్శీ కామెంట్స్!

Sri Reddy Contraversy Comments on Amala Paul

  • భవ్నీందర్ సింగ్ ను అమలాపాల్ పెళ్లాడినట్టు వార్తలు
  • పెళ్లి చేసుకోలేదని ఇప్పటికే స్పష్టం చేసిన అమలాపాల్
  • పంజాబీ భర్త బాగా చూసుకుంటాడన్న శ్రీరెడ్డి

నటి అమలాపాల్ ఇటీవల తన ప్రియుడు, పంజాబీ గాయకుడు భవ్నీందర్ సింగ్ ను వివాహం చేసుకున్నట్టుగా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై అమలాపాల్ వివరణ ఇస్తూ, తానేమీ పెళ్లి చేసుకోలేదని, అవి ఫొటో షూట్ కోసం దిగినవని చెప్పింది.

ఇక, నిత్యమూ తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచివుండే శ్రీరెడ్డి, దీనిపై స్పందిస్తూ, వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా, నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. "బాధపడకు అమలాపాల్‌.. నీ పంజాబీ భర్త బాగానే చూసుకుంటాడు. నాకు పంజాబీలపై నమ్మకం ఉంది" అని కామెంట్ పెట్టింది. ఇక ఈ కామెంట్ చూసిన వారంతా, కరోనా విజృంభిస్తున్న ఈ రోజుల్లో ప్రజలు ఆందోళనలో ఉండగా, ఇటువంటి పోస్టుల అవసరం ఏంటని వ్యాఖ్యానిస్తున్నారు.

కాగా, అమలాపాల్, 2014లో దర్శకుడు విజయ్ ని పెళ్లాడి, ఆపై విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆపై విజయ్ మరో పెళ్లి చేసుకోకున్నారు కూడా.

Sri Reddy
Amala Paul
Second Marriage
Comments
  • Loading...

More Telugu News