Ivanka Trump: మోదీ యోగ నిద్ర ఆసనంపై ఇవాంకా ట్రంప్ స్పందన

Ivanka Trump responds on PM Modi Yoga Nidra aasan
  • ఒత్తిడిని యోగ నిద్ర ఆసనంతో తొలగించుకోవాలన్న మోదీ
  • యోగ నిద్ర ఆసనాన్ని అద్భుతం అని పేర్కొన్న ఇవాంకా
  • ప్రధాని మోదీకి ట్విట్టర్ లో కృతజ్ఞతలు
తనకెప్పుడు ఖాళీ సమయం లభించినా యోగ నిద్ర ఆసనం వేస్తుంటానని, ఇది ఒత్తిడిని అమోఘంగా తొలగిస్తుందని, లాక్ డౌన్ కాలంలో ఫిట్ గా ఉండడానికి ఈ ఆసనం వేయండంటూ ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి కొద్దిసేపటి క్రితమే ట్వీట్ చేశారు.

 యోగ నిద్ర ఆసనం వేసే విధానంపై ఆయన ఓ వీడియోను కూడా ట్వీట్ చేయగా దానిపై  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనయ ఇవాంకా ట్రంప్ వెంటనే స్పందించారు. "ఇది అద్భుతం" అంటూ కొనియాడారు. అంతేకాదు, ప్రధానికి ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. మోదీ యోగాసనాలు వేయడంలో దిట్ట అని తెలిసిందే. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆయన వేలమందితో కలిసి యోగా ఆచరించారు.
Ivanka Trump
Narendra Modi
Yoga Nidra
Yoga
Donald Trump
USA

More Telugu News