Kona Venkat: శ్రీను వైట్లతో గ్యాప్ రావడానికి అదే కారణం: కోన వెంకట్

Kona venkat

  • సినిమా అనేది టీమ్ వర్క్ 
  •  అందుకే దూరంగా వుండాలనుకున్నాను 
  •  మా మధ్య పగ .. ప్రతీకారాలు లేవన్న కోన 

కోన వెంకట్ .. శ్రీను వైట్ల కాంబినేషన్లో వచ్చిన సినిమాలు చాలా వరకూ విజయాలను అందుకున్నాయి. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో రచయిత కోన వెంకట్ మాట్లాడుతూ, శ్రీను వైట్ల గురించి స్పందించాడు. "సినిమా అనేది టీమ్ వర్క్ .. సినిమా ఫ్లాప్ అయినా, హిట్ అయినా అందుకు టీమ్ వర్క్ కారణమనే చెప్పాలి. ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం.

సినిమాకి సంబంధించిన ప్రతి విషయంలో దర్శకుడి జోక్యం ఉంటుంది. నేను రాసిన పంచ్ డైలాగ్స్ ను ఆయన బెటర్ చేసుకునేవాడు. అందువలన నేనే అన్నీ చేశాను అనే ఫీలింగ్ ఆయనకి వచ్చిందా? నా కాంట్రిబ్యూషన్ ను ఆయన గుర్తించడం లేదా? అనే ఫీలింగ్ నాకు వచ్చింది. నాకు తగిన గుర్తింపు ఇవ్వనప్పుడు ఇక దూరంగా ఉండటం మంచిదనే నిర్ణయానికి వచ్చాను. మళ్లీ మా కాంబినేషన్లో సినిమాలు రాకూడదని ఏమీ లేదు. ఎందుకంటే మా మధ్య పగ .. ప్రతీకారాలేం లేవు" అంటూ నవ్వేశారు.

Kona Venkat
Srinu Vaitla
Tollywood
  • Loading...

More Telugu News