Varavara rao: బీమా కోరేగావ్ కుట్ర కేసులో వరవరరావుకు బెయిల్ తిరస్కరణ

VaraVara Rao not get bail

  • పూణె జైలులో ఉన్న వరవరరావు
  • ‘కరోనా’ వ్యాప్తి నేపథ్యంలో బెయిల్ కు పిటిషన్
  • తిరస్కరించిన ముంబైలోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు 

బీమా కోరేగావ్ కుట్ర కేసులో విరసం నేత వరవరరావు ప్రస్తుతం పూణే జైలులో ఉన్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో వరవరరావు, నాగపూర్ యూనివర్శిటీ ప్రొఫెసర్ సోమా సేన్ లు తమకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ముంబైలోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టులో పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్ల పై విచారణ జరిపిన న్యాయస్థానం వారికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.

కాగా, పూణె సమీపంలోని బీమా కోరేగాం హింసలో మావోయిస్టుల ప్రమేయం ఉందని, ఆ కేసు దర్యాప్తు సందర్భంగా ప్రధాని మోదీ హత్యకు మావోయిస్టులు కుట్ర పన్నారని ఆరోపణలు. ఆ కుట్ర కేసులో ఐదుగురిని అరెస్ట్ చేయగా, అందులో వరవరరావు కూడా ఉన్నారు. దాదాపు ఏడాది కాలంగా బెయిల్ కోసం వరవరరావు ప్రయత్నించినప్పటికి మంజూరు కాలేదు.

Varavara rao
Virasam
writer
Bima koregam
case
bail
  • Loading...

More Telugu News