Kona Venkat: ఆ సినిమాతో రోడ్డుమీదకు వచ్చేశాను: రచయిత కోన వెంకట్

Thokaleni Pitta Movie

  • 'తోకలేని పిట్ట'ను నిర్మించాను 
  • ఉన్నవన్నీ అమ్ముకోవాల్సి వచ్చింది 
  • ముంబై వెళ్లిపోయానన్న కోన

రచయితగా కోన వెంకట్ కి మంచి పేరు వుంది. ఆయన రాసిన కథలతో ఎన్నో సినిమాలు విజయాలను అందుకున్నాయి. ప్రస్తుతం ఆయన నిర్మాతగాను సినిమాలు చేస్తున్నారు. తాజాగా ఆయన 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ, "నా అసలు పేరు కోన వెంకట్రావు. ఓ కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తుండగా, 'తోకలేని పిట్ట' సినిమాను నిర్మించాను. అప్పటికే నాకు పరిచయమున్న వర్మ .. వద్దని చెప్పినా నేను వినిపించుకోలేదు.

సినిమా ఫీల్డ్ నాకు కొత్త కావడంతో, నేను క్యాష్ చేసుకోలేకపోయాను. ఫలితంగా నష్టాలు వచ్చాయి. మాది వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ .. కానీ ఆ సినిమా నష్టాలతో ఉన్నవన్నీ అమ్మేసుకుని రోడ్డు మీదకి వచ్చేశాను. ఒక చిన్న షెడ్డు లాంటి ఇంట్లోకి మారవలసి వచ్చింది. పిల్లలకి ఫీజు కూడా కట్టడానికి డబ్బులు లేని పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో నేను ముంబైలో వున్న వర్మ దగ్గరికి వెళ్లిపోయాను" అని చెప్పుకొచ్చాడు.

Kona Venkat
Ali
Thokaleni Pitta Movie
  • Loading...

More Telugu News