Rashmika Mandanna: రష్మిక తీసుకున్న కొత్త నిర్ణయం?

Rashmika Movies

  • వరుస విజయాలతో రష్మిక 
  • అభిమానుల్లో పెరుగుతున్న క్రేజ్ 
  • వెతుక్కుంటూ వస్తున్న అవకాశాలు

ఇప్పుడు రష్మిక పట్టిందల్లా బంగారమవుతోంది. ఆమె చేసిన ప్రతి సినిమా విజయవంతమవుతోంది. మహేశ్ బాబుతో చేసిన 'సరిలేరు నీకెవ్వరు' .. నితిన్ జోడీగా చేసిన 'భీష్మ' విజయాలు ఆమె స్టార్ డమ్ ను అమాంతంగా పెంచేశాయి. దాంతో చాలామంది దర్శక నిర్మాతలు తమ సినిమాల్లోకి రష్మికను తీసుకోవడానికి ఉత్సాహాన్ని చూపుతున్నారు.

ఇక కొంతమంది యువ కథానాయకులు కూడా తమ జోడీగా రష్మికను ట్రై చేయమని దర్శక నిర్మాతలతో చెబుతున్నారట. అయితే రష్మిక చిన్న సినిమాలకి దొరకని స్థాయిలో తన పారితోషికాన్ని పెంచేసినట్టుగా ఒక వార్త వినిపిస్తోంది. అంతేకాదు .. స్టార్ డమ్ లేని హీరోలకి సంబంధించిన ప్రాజెక్టులను ఒప్పుకోవద్దని తన మేనేజర్ తో చెప్పిందని అంటున్నారు. మొత్తానికి రష్మిక తన స్థాయిని మరో మెట్టుపైకి తీసుకెళ్లే పనిలోనే వుందన్న మాట.

Rashmika Mandanna
Mahesh Babu
Nithin
  • Loading...

More Telugu News