Visakhapatnam: విశాఖలో కరోనాను జయించిన 60 ఏళ్ల వృద్ధుడు

Viskakha old man wins corona

  • ఈ నెల 14న మదీనా నుంచి విశాఖ వచ్చిన వ్యక్తి
  • 17వ తేదీన కరోనాతో ఆసుపత్రిలో చేరిక
  • ఆది, సోమవారాల్లో నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగెటివ్
  • త్వరలోనే డిశ్చార్జి చేస్తామన్న ఆసుపత్రి వర్గాలు

కరోనా వైరస్ ఎక్కువగా వయసు పైబడినవారిలోనే ప్రాణాంతకంగా మారుతున్న నేపథ్యంలో విశాఖలో 60 ఏళ్ల వృద్ధుడు ఈ మహమ్మారి బారి నుంచి కోలుకోవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ నెల 14న ఆ వ్యక్తి మదీనా నుంచి విశాఖకు వచ్చాడు.

అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు వైద్యపరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్టు తేలింది. మార్చి 17 నుంచి చికిత్స అందిస్తున్నారు. తాజాగా ఆ వ్యక్తికి నెగెటివ్ రావడంతో కరోనా నయమైనట్టు నిర్ధారించారు. ఆదివారం, సోమవారం రెండ్రోజులు కరోనా టెస్టులు చేయగా, రెండు పరీక్షల్లో నెగెటివ్ అనే వచ్చింది. ప్రస్తుతం ఆ వృద్ధుడి ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే డిశ్చార్జి చేస్తామని టీబీసీడీ ఆసుపత్రి సూపరింటిండెంట్ డాక్టర్ విజయ్ కుమార్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News