Rajamouli: అప్పటి చరణ్ కి .. ఇప్పటి చరణ్ కి చాలా తేడా వుంది: రాజమౌళి

RRR Movie

  • 'మగధీర' సమయంలో చరణ్ ను చూశాను 
  • నటన పరంగా పరిణతి సాధించాడు 
  •  తనకి ఎంతో ఆనందంగా వుందన్న రాజమౌళి

రాజమౌళి తాజా చిత్రమైన 'ఆర్ ఆర్ ఆర్' షూటింగు దశలో వుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటిస్తున్నాడు. రీసెంట్ గా చరణ్ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని, ఆయన పాత్రను పరిచయం చేస్తూ ఒక వీడియో వదిలారు. ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ నేపథ్యంలో చరణ్ గురించి రాజమౌళి మాట్లాడుతూ, 'గతంలో చరణ్ తో 'మగధీర' చేశాను. అప్పుడు నేను చూసిన చరణ్ వేరు .. ఇప్పుడు నేను చూస్తున్న చరణ్ వేరు. 'రంగస్థలం' సినిమా చూసిన తరువాత నటన పరంగా చరణ్ చాలా మెట్లు ఎక్కేశాడనే విషయం నాకు అర్థమైంది. 'ఆర్ ఆర్ ఆర్' షూటింగులో ఆయన నటనను ఎంజాయ్ చేస్తూ చేయడాన్ని చూశాను. నటన పట్ల ఆయనకి గల అంకితభావాన్ని గమనించాను. చరణ్ ఈ స్థాయిలో తన పరిణతిని కనబరచడం ఆశ్చర్యంగాను .. ఆనందంగాను వుంది" అంటూ ప్రశంసించారు.

Rajamouli
Charan
RRR Movie
  • Loading...

More Telugu News