America: అమెరికన్ సింగర్ జో డిఫీని కబళించిన కరోనా వైరస్

American singer died with corona virus

  • 1990లలో అమెరికాను ఉర్రూతలూగించిన జో డిఫీ
  • తనకు కరోనా సోకినట్టు రెండు రోజుల క్రితమే వెల్లడించిన జో
  • విషాదంలో అభిమానులు

అమెరికన్ జానపద సంగీతాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన అమెరికన్ సింగర్ జో డిఫీ (61) కరోనా కాటుకు బలయ్యారు. తనకు కోవిడ్ సోకినట్టు జో డిఫీ రెండు రోజుల క్రితమే సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అంతలోనే ఆయన ప్రాణాలు కోల్పోవడం అభిమానులను తీవ్ర విషాదంలో ముంచింది. పికప్ మ్యాన్, ప్రాప్ మీ ఆఫ్ బిసైడ్ ద జూక్‌బాక్స్, జాన్ డీర్ గ్రీన్ వంటి పాటలు ఆయనను ప్రపంచానికి పరిచయం చేశాయి. తన పాటలతో 90లలో అమెరికన్ సమాజాన్ని ఉర్రూతలూగించారు. గ్రామీ అవార్డులను కూడా పలుమార్లు జో అందుకున్నారు.

America
singer
Corona Virus
  • Loading...

More Telugu News