Corona Virus: ఈ ఏడాది ఐపీఎల్ ఇక రద్దు.. త్వరలో అధికారిక ప్రకటన?

BCCI decided to cancel IPL 2020

  • నిన్ననే ప్రారంభం కావాల్సిన ఐపీఎల్
  • కోవిడ్ నేపథ్యంలో ఏప్రిల్ 15కు వాయిదా
  • ప్రభుత్వాన్ని సంప్రదించిన అనంతరం రద్దు ప్రకటన?

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు ఇది నిరాశ కలిగించే విషయమే. కరోనా వైరస్ నేపథ్యంలో వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ ను రద్దు చేయాలని బీసీసీఐ తాజాగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.

నిజానికి ఐపీఎల్ నిన్ననే ప్రారంభం కావాల్సి ఉండగా, దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టోర్నీని ఏప్రిల్ 15కు వాయిదా వేస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. అయితే, అప్పటికి కూడా దేశంలో పరిస్థితులు కుదుటపడే అవకాశం కనిపించకపోవడంతో ఐపీఎల్‌ను పూర్తిగా రద్దు చేయడం మినహా మరో ప్రత్యామ్నాయం కనిపించడం లేదని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించిన అనంతరం ఐపీఎల్‌ను రద్దు చేస్తున్నట్టు బీసీసీఐ అధికారికంగా ప్రకటిస్తుందని ఆ వర్గాలు తెలిపాయి.

Corona Virus
IPL 2020
BCCI
  • Loading...

More Telugu News