Mahesh Babu: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Keerthi Suresh gives nod to Mahesh film
  • గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కీర్తి 
  • కరోనాపై ప్రశాంత్ వర్మ చిత్రం 
  • వెంకటేశ్ సినిమాకి స్క్రిప్టు రెడీ  
 *  'సరిలేరు నీకెవ్వరు' చిత్రం తర్వాత మహేశ్ బాబు తన తదుపరి చిత్రాన్ని పరశురాం దర్శకత్వంలో చేయనున్న సంగతి విదితమే. మహేశ్ సూచన మేరకు ఇందులో కథానాయికగా కీర్తి సురేశ్ ని సంప్రదించారని, ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. తాజాగా ఆమె ఈ చిత్రానికి డేట్స్ కూడా కేటాయించినట్టు సమాచారం.
*  'అ..!', 'కల్కి' చిత్రాల దర్శకుడు ప్రశాంత్ వర్మ తాజాగా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ నేపథ్యంగా ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఇప్పటికే సగం షూటింగ్ పూర్తయిందనీ, లాక్ డౌన్ ముగిసిన వెంటనే మిగతా షూటింగ్ కూడా పూర్తి చేస్తాడని తెలుస్తోంది. దీనికి ఆయనే నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు.
*  ప్రముఖ నటుడు వెంకటేశ్ హీరోగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి స్క్రిప్టు వర్క్ పూర్తయిందని, త్వరలో వెంకటేశ్ కి వినిపిస్తానని దర్శకుడు చెప్పాడు. ఈ చిత్రాన్ని సురేశ్ బాబు నిర్మిస్తారు.    
Mahesh Babu
Parashuram
Keerthi suresh
Venkatesh

More Telugu News