Rythu bazar: హైదరాబాద్ లో మొబైల్ రైతు బజార్లు ప్రారంభం

 GHMC launches Mobile Rythu Bazarras

  • లాక్ డౌన్ ఎఫెక్ట్ .. ప్రజల ఇళ్ల వద్దకే కూరగాయలు
  • 145 మొబైల్ రైతు బజార్లు ప్రారంభం
  • భవిష్యత్ లో వీటి సంఖ్య మరింత పెంచుతామన్న కేటీఆర్

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ నగర వాసులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు జీహెచ్ఎంసీ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. ప్రజల ఇళ్ల వద్దకే కూరగాయలు తీసుకువెళ్లాలన్న ఉద్దేశంతో మొబైల్ రైతు బజార్లను ప్రారంభించారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో 145 మొబైల్ రైతు బజార్లను ప్రారంభించామని, భవిష్యత్ లో వీటి సంఖ్య మరింత పెంచుతామని చెప్పారు.

Rythu bazar
Ghmc
Hyderabad
Corona Virus
ktr
Telangana
  • Loading...

More Telugu News