Corona Virus: రాష్ట్రాలు, జిల్లాల సరిహద్దులు మూసేయాలని కేంద్రం ఆదేశం

Centre orders states to closes borders

  • దేశంలో ఇప్పటికీ అదుపులోకి రాని కరోనా
  • లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయాలని కేంద్రం నిర్ణయం
  • నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరిక

దేశంలో లాక్ డౌన్ విధించినా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం తాజా ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రాలు, జిల్లాల సరిహద్దులు మూసేయాలని స్పష్టం చేసింది. కేవలం నిత్యావసర సరుకుల రవాణాకు మాత్రమే అనుమతించాలని పేర్కొంది.

నిబంధనలు ఉల్లంఘించి ప్రయాణాలు చేస్తే కఠినంగా వ్యవహరించాలని ఆదేశించింది. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పూర్తి బాధ్యత తీసుకోవాలని తన ఆదేశాల్లో పేర్కొంది. నగరాల నుంచి ఇతర ప్రాంతాలకు ప్రయాణాలు లేకుండా చూడాలని, ఇప్పటికే సరిహద్దు దాటిన వాళ్లను 14 రోజులు క్వారంటైన్ లో ఉంచాలని సూచించింది. విద్యార్థులు, కార్మికులను ఇళ్లను ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తే చర్యలు తప్పవని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది.

  • Loading...

More Telugu News