islamic state: భారత్‌లో కరోనా విజృంభిస్తోంటే.. తమ పని తాము చేసుకుపోతోన్న ఉగ్రవాదులు

is targets delhi

  • జమ్మూకశ్మీర్‌ నుంచి ఢిల్లీకి ఇద్దరు ఉగ్రవాదులు
  • దాడులకు ప్రణాళిక
  • హెచ్చరించిన నిఘా వర్గాలు 
  • గస్తీ పెంచాలని సూచన

కరోనా వైరస్ వ్యాప్తితో భారత్‌ వణికిపోతుంటే ఉగ్రవాదులు తమ పనులు తాము చేసుకుంటూ పోతున్నారు. ఢిల్లీలో దాడులకు ప్రణాళికలు రచించుకుంటున్నారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఢిల్లీలో ఉగ్రదాడులు చేసే అవకాశం ఉన్నట్లు  కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.

జమ్మూకశ్మీర్ లోని షోపియాన్ ప్రాంతంలోని రహస్య శిబిరంలో ఇద్దరు పాక్‌ ఉగ్రవాదులు ఇంతవరకు ఉన్నారని, అక్కడి నుంచి ఇటీవల ఢిల్లీకి వచ్చారని చెప్పింది. వారు టెలిగ్రాం యాప్‌ ద్వారా సంప్రందింపులు కొనసాగిస్తున్నారని వెల్లడించింది. ఢిల్లీతో పాటు పంజాబ్, ఉత్తరప్రదేశ్ లోని పాక్ సరిహద్దుల్లో గస్తీ పెంచాలని చెప్పింది. ఓ వైపు కరోనా విజృంభణ, మరోవైపు ఉగ్రవాదుల ప్రణాళికల నేపథ్యంలో హైఅలర్ట్ ప్రకటించాలని సూచించింది.

islamic state
India
Corona Virus
  • Loading...

More Telugu News