Alla Nani: ఇక ఉదయం 11 దాటితే ప్రజలు బయటకు రావద్దు: ఏపీ మంత్రుల హెచ్చరిక

ap govt on corona

  • నిత్యావసరాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాం
  • వ్యాపారులందరూ ధరల పట్టికను ఏర్పాటు చేసుకోవాలి 
  • ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకే కొనుగోళ్లకు అవకాశం  
  • నిత్యావసరాల కొరత రాకుండా ఇప్పటి నుంచే ప్లాన్‌ 

నిత్యావసరాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామని ఏపీ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... వ్యాపారులందరూ ధరల పట్టికను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. పట్టికలో ఉన్నదాని కంటే అధిక ధరకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిత్యావసరాల కొరత రాకుండా చూస్తున్నామని తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకే కొనుగోళ్లకు అవకాశమన్నారు. 11 దాటితే ప్రజలు బయటకు రావద్దని చెప్పారు.

చిన్న దుకాణాలు కూడా ధరల పట్టికను ఏర్పాటు చేయాలని మంత్రి కన్నబాబు చెప్పారు. నిత్యావసరాల కొరత రాకుండా ఇప్పటి నుంచే ప్లాన్‌ చేసుకోవాలని సీఎం జగన్ చెప్పారని తెలిపారు. రైతు బజార్ల మాదిరిగానే నిత్యావసరాల ధరలు పట్టికలో చూపాలని చెప్పారు.

  • Loading...

More Telugu News